Beautiful Telugu Love Quotes with deep meaning
Telugu Love Quotes |
నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు.నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను.
నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు,నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న ప్రతి పనిని చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా.కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా.నా జీవితాన్ని రంగులమయంగా,ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.
నా హృదయాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.
నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా.ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను.ఎందుకంటే నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.
నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు.నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు.ఎందుకంటే నాకు తోడుగా నువ్వు ఉన్నావు.
శ్వాస తీసుకోవడం,నిన్ను ప్రేమించడం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.
ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను.నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా.ఆ తర్వాత తెలిసింది.నీ గురించి ఆలోచిస్తున్నానని.
నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా.అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని.
Telugu Quotes About Love |
నీకు నేను చాలాసార్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్లు,త్వరగా నిద్రపో,భోంచేయ్ అని చెబుతూ ఉంటా కదా ఆ సమయంలో నీకు ఏం చెప్పాలనుకొంటానో తెలుసా?ఐ లవ్యూ అని.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నానని కాదు.నీ మనసును,నీ గుణాన్ని,నీ అలవాట్లను,నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.
నా తుదిశ్వాస విడిచేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్తా.
నిన్ను చూసినప్పుడు నీతో మాట్లాడటానికి భయపడ్డాను.నీతో మాట్లాడిన తర్వాత నిన్ను తాకడానికి భయపడ్డాను.తాకిన తర్వాత ప్రేమించడానికి భయపడ్డా.ప్రేమించిన తర్వాత నువ్వు నాకెక్కడ దూరమైపోతావోనని భయపడుతున్నా.ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు.
నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది.నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.
నీ మీద నాకున్న ప్రేమకు అంతం లేదు.ఆరంభమూ లేదు.నా శరీరంలో అతి ముఖ్యమైన,నా ప్రాణం నిండిన అవయవంగా మారిపోయావు.నీ నుంచి ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించడం లేదు.నీ మనసులో స్థానాన్ని మాత్రమే కోరుకొంటున్నాను.నా బలహీనత,బలం రెండూనువ్వే.
ఎప్పుడైనా నీకు నేను ఐలవ్యూ మోర్ అని చెబితే దాని అర్థం నన్ను నువ్వు ప్రేమిస్తున్నదానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని కాదు.మనిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే దానికంటే నువ్వే నాకు ముఖ్యమని.మనిద్దరి మధ్య పెరుగుతున్న దూరం కంటే నువ్వే నాకే ఎక్కువని.మనిద్దరి మధ్య ఎలాంటి అడ్డుగోడ ఏర్పడినా సరే దాన్ని పడగొట్టి మరీ నీ దగ్గరకు వస్తా.ఎందుకంటే నువ్వే నా ఊపిరి.
నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు.నేను అనుకొన్నదానికంటే నువ్వునాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు.ఊహించని విధంగా మనిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నా ప్రతి క్షణం నీతోనే గడపాలనిపిస్తుంది.దానికి కారణం ఏంటో నీకు తెలుసా?
ప్రతి రోజూ నేను నీతో ప్రేమలో పడుతూనే ఉన్నా.నిన్న మాత్రం నీమీద ప్రేమకు బదులు కోపం వచ్చింది.ఆ కోపం పెరగడానికి నువ్వే కదా కారణం.ఇప్పుడు నువ్వే ఆ కోపాన్ని తగ్గించు.
నాకు చాలా బాధగా ఉంది.నా మీద నాకే కోపం వస్తుంది.కంట్లోంచి నీరు వస్తున్నాయి.నీకు ప్రేమ పంచాల్సిన నేను నిన్ను నిందించడం నాకు నచ్చలేదు.నన్ను క్షమించు.
నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోవడానికి అందరూ కలసి లక్ష కారణాలు వెతకొచ్చు.నేను మాత్రం నీతో కలసి గడపడానికి కారణాలు వెతుకుతాను.
నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం.మనిద్దరం కొట్టుకొందాం.కానీ ఆ తగాదా తర్వాత ఒకరినొకరు క్షమించుకొందాం.తిరిగి ప్రేమలో పడదాం,ఆనందంగా గడుపుదాం.
నా దగ్గర టైం మిషన్ ఉంటే వెంటనే కాలాన్ని వెనక్కి తిప్పేస్తా.నును అన్న మాటలకు బదులుగా నీకు ఐలవ్యూ చెప్తా.కానీ ఏం చేస్తాం.కాలాన్ని వెనక్కి తిరిగేలా చేసే శక్తి నా దగ్గర లేదు.నేనన్న మాటలను వెనక్కీ తీసుకోలేను.నన్ను క్షమించు.మనం మునుపటిలా ఆనందంగా గడుపుదాం.
నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా విలువైనది.అవన్నీ నాకు మధురమైన జ్నాపకాలే.ఈ క్షణం కూడా నువ్వు నా పక్కన ఉంటే బాగుండుననిపిస్తుంది.కానీ కొన్ని రోజులు ఇలా తప్పదు డియర్.మిస్ యూ అండ్ లవ్యూ.
జీవితంలో చిన్న చిన్న విషయాలు చాలా సంతోషాన్నిస్తాయంటారు.అది నిజమని ఈ క్షణం వరకు నాకు అనిపించలేదు.నువ్వు దగ్గరున్నప్పుడు చాలా చిన్న విషయాలుగా అనిపించినవే ఇప్పుడు నేను మిస్సవుతున్నాను.నీ చేతి వంట,నువ్వు చేసిన కాఫీ చాలా మిస్సవుతున్నాను.అందుకే వీలైనంత వరకు ఎక్కువ సమయం నీతో గడపడానికి కేటాయిస్తాను.
నువ్వు నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావో.నీకు దూరంగా ఉన్న ఈ నాలుగు రోజుల్లో నాకు తెలిసింది.నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఇంత శూన్యంగా ఉంటుందా అనిపిస్తుంది.
నువ్వు దూరంగా ఉన్న ప్రతి క్షణం చాలా భారంగా అనిపిస్తోంది.రెక్కలు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి వాలిపోవాలని ఉంది.క్షణమొక యుగమంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది.
నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే.నేనెంత కోపంగా ఉన్నా ఎంత పిచ్చిగా ప్రవర్తించినా నీతో గొడవపడినా నాపై నీకున్న ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు.నీమీద నాకున్న ప్రేమ కూడా ఏ మాత్రం తగ్గదు.
నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టిన మొదటి క్షణమే నాకు అర్థమైంది.నువ్వే నా ప్రపంచమని.నా ప్రపంచం ఎప్పటికీ నాకు దూరంగా ఉండదు.తన ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ ప్రేమను నిలబెట్టుకొంటారు.మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తాత్కాలికమే.ఇది మన ప్రేమకు పరీక్షలాంటిది.ఆ పరీక్షలో ఇద్దరూ కలసి పాసవడానికి ట్రై చేద్దాం.
ప్రేమ భరించే శక్తినిస్తుంది.ప్రేమ నమ్మకాన్నిస్తుంది.ప్రేమ ఆశలు చిగురింప చేస్తుంది.అలాంటి ప్రేమ తోడుగా ఉన్నంత వరకు మనిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా ఆ దూరాన్ని ఇట్టే కరింగేచేస్తుంది.
Beautiful Telugu Quotes About Love,Sad Love Quotes In Telugu
ఎలాంటి పరిస్థితులెదురైనా సరే నేనెంత దూరంలో ఉన్నా సరే నువ్వు బాధపడుతున్నావనిపిస్తే చాలు నీ దగ్గరకు వచ్చి వాలిపోతా.ఎందుకంటే నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను.
నిజమైన సంతోషం గుండెల్లో దాగి ఉంటుందంటారు.నిజమే నా సంతోషం నా గుండెల్లోనే దాగి ఉంది.నా సంతోషం నువ్వే కదా.
ప్రేమంటే ఏంటో నీకు తెలుసా?చంపేయాలన్నంత కోపం ఉన్న వ్యక్తితో కలసి జీవితం పంచుకోవడం.చంపేస్తే వారిని మిస్సవుతాం కదా. ఏమంటావు మై డియర్ లవ్?
చాక్లెట్,నిన్ను రెండింటినీ పక్కపక్కనే పెట్టి ఏది కావాలంటే కాసేపు ఆలోచించైనా సరే నిన్నే ఎంచుకొంటా.ఏం చేస్తాం తప్పదు కదా మరి.
ప్రేమించడానికి చాలా ధైర్యం కావాలి.ఆ ప్రేమను సాకారం చేసుకొనేందుకు మనం పడే ఇబ్బందులు,బాధ,తపన అన్నీ మనల్ని ధైర్యవంతులుగా చేస్తాయి.ఆ ధైర్యం నీలో ఉంది.నాలో ఉంది.మనిద్దరం కలసి ఏదైనా సాధించగలం.
ప్రేమ ముందు ఏ అడ్డంకి నిలవలేదు.నా జీవిత గమ్యమైన నిన్ను చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాను.నీ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను.
ప్రేమంటే ఏంటో తెలుసా?నీ సంతోషంలో నా సంతోషాన్నిచూడటం.నీ బాధని నా బాధగా అనుకోవడం.నువ్వు సంతోషంగా ఉంటావా? బాధపడుతూనే ఉంటావా?
ప్రేమలో స్నేహం,అర్థం చేసుకొనే గుణం,ఆత్మవిశ్వాసం,పంచుకొనే తత్వం,క్షమాగుణం అన్నీ ఉంటాయి.ఆనందంలోనూ,బాధలోనూ మనకు తోడు ఉంటుంది.నీలో ఉన్న బలహీనతను కూడా ఇష్టపడుతుంది.
ఏ అనుబంధంలోనూ అన్నీ మంచి రోజులే ఉండవు.తుఫానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం.ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది.
నీ నవ్వులో చందమామను మించిన అందాన్ని,నక్షత్రాలను మించిన మెరుపును చూస్తున్నాను.
నిన్ను మొదటిసారి కలిసినప్పడే నీ దగ్గర నాకు కావల్సిందేదో ఉందనిపించింది.ఎంత ఆలోచించినా అదేంటో నాకు అర్థం కాలేదు.చివరికి నాకు కావాల్సింది నువ్వేనని అర్థమయింది.
నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా?సముద్రంలో ఉన్న నీరంత.ఎడారిలో ఉన్న ఇసుక రేణువులంత.ఆకాశంలో ఉన్న నక్షత్రాలంత.
Comments
Post a Comment